TPT: చంద్రగిరి మండలం పనపాకం పాకాలవారిపల్లి వద్ద ఓ వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం అర్థరాత్రి జరిగిన ఘటనపై పాకాల రైల్వే పోలీసుల వివరాలు మేరకు.. చంద్రగిరి మండలం పాకాలవారిపల్లికి చెందిన పాశం రెడ్డికుమార్ (45) జీవితంపై విరక్తి చెందిన పనపాకం సమీపంలో ఎదురుగా వస్తున్న రైలుకు అడ్డు వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు.