VKB: అభివృద్ధి, సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం పూడూరు మండల పరిధిలోని కండ్లపల్లిలో పలు అభివృద్ధి పనులను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. దశలవారీగా పరిగి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని తెలిపారు.