జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల మధ్య సీట్ల పంపకాలు ఖరారయ్యాయి. మొత్తం 81 స్థానాలకుగానూ బీజేపీ 68 స్థానాల్లో పోటీ చేయనుంది. అల్ జార్ఖండ్ స్టూడెంట్ యూనియన్ (AJSU) 10 స్థానాల్లో, జనతాదళ్ యునైటెడ్ (JDU)కు రెండు సీట్లు కేటాయించారు. అలాగే, చిరాగ పాశ్వాన్ పార్టీ లోక్ జనశక్తి పార్టీ (LJP)కి చత్రా సీటును కేటాయించారు. వీలైనంత త్వరగా అభ్యర్థులను ప్రకటించనున్నట్లు సమాచారం.