బెంగళూరులో జరుగుతున్న తొలి టెస్ట్‌లో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగులకే ఆలౌటైంది. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 402 పరుగులు చేసి 356 పరుగుల ఆధిక్యం సాధించింది. ఇప్పటి వరకు టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇంగ్లాండ్ మాత్రమే 1887లో తొలి ఇన్నింగ్స్‌లో 50 కంటే తక్కువ పరుగులు చేసి కూడా టెస్ట్ మ్యాచ్ విజయం సాధించింది. ఇప్పుడు భారత్ ఈ మ్యాచ్ గెలిచి 137 ఏళ్ల చరిత్రను తిరగరాస్తుందా అనేది ఆసక్తిగా మారింది.