AP: పోలీసు ఉద్యోగం అంటే కష్టాలు, సవాళ్లు ఎదుర్కొనే జాబ్ అని DGP ద్వారకా తిరుమల రావు అన్నారు. ‘విధి నిర్వహణలో పోలీసులు క్లిష్ట పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రాణాలు కూడా త్యాగాలు చేయాల్సి వస్తుంది. ఈ నెల 21 నుంచి 31 వరకు పోలీసు సంస్మరణ దినోత్సవాలు జరుగుతాయి. 21న నివాళులు అర్పిస్తూ దేశంలో అమరులైన వారి పేర్లను చదువుతాం. పోలీసులకు రుణాలు, బీమా, పరిహారం అందించే ఏర్పాటు చేశాం’ అని తెలిపారు.