AP: బీజేపీ సభ్యత్వానికి ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చారని పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ పురందేశ్వరి అన్నారు. రాజమండ్రిలో నిర్వహించిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. సభ్యత్వ నమోదు కొంచెం మందకొడిగా మొదలైందని, రాష్ట్రంలో వరదలు, వర్షాల వల్ల ఆలస్యమైందని పేర్కొన్నారు. సభ్యత్వ నమోదులో తూర్పుగోదావరి జిల్లా నాలుగో స్థానంలో ఉందన్నారు.