TG: హైదరాబాద్‌లో గ్రూప్-1 అభ్యర్థులు మరోసారి ఆందోళనకు దిగారు. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు రీ షెడ్యూల్ చేయాలని డిమాండ్ చేస్తూ అశోక్‌నగర్‌లో ప్లకార్డులతో రోడ్లపైకి వచ్చారు. ఈ క్రమంలో 16మందిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆందోళకారులను అదుపుచేసే క్రమంలో తోపులాట జరిగి, పలువురికి గాయాలయ్యాయి. కాగా.. అశోక్‌నగర్‌లో పోలీసు పహారా కొనసాగుతోంది.