ADB: బోథ్ మండల కేంద్రంలో మాల సంక్షేమ సంఘం నాయకులు సంఘం భవనంలో బుధవారం సమావేశం ఏర్పాటు చేశారు. వారు మాట్లాడుతూ.. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిపై ఎమ్మార్పీఎస్ నాయకుల వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఎమ్మెల్యేను రాజీనామా కోరే హక్కు వారికి లేదన్నారు. జనాభా ప్రాతిపదికన ఎస్సీ వర్గీకరణ చేస్తే తమకు ఎటువంటి అభ్యంతరం లేదని పేర్కొన్నారు.