AP: శ్రీవారి బ్రహ్మోత్సవాలు తిరుమలలో వైభవంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా ఇవాళ ఉదయం స్వామివారు రాముని అవతారంలో హనుమంత వాహనంపై మూడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయమిచ్చారు. ఈ కార్యక్రమానికి పెద్దఎత్తున భక్తులు తరలివచ్చి భక్తి పారవశ్యంతో స్వామిని దర్శించుకున్నారు. ఆలయంలో సాయంత్రం 4గంటల నుంచి 5 గంటల వరకు స్వర్థ రథోత్సవం నిర్వహించనున్నారు.