ATP: దసరా నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఏడవ రోజు బుధవారం గుత్తి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకుడు వాసుదేవ శర్మ ఆధ్వర్యంలో అమ్మవారి మూలమూర్తికి వేరుశెనగ, పప్పు సెనగ విత్తనాలతో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. అనంతరం అమ్మవారికి మహా మంగళహారతి పూజా కార్యక్రమాలు నిర్వహించారు.