SRD: మనూరు మండలం బోరంచ నల్ల పోచమ్మ దేవస్థానంలో బుధవారం అమ్మవారికి విశేషాలంకరణతో పూజలు చేశారు. అర్చకులు నాగేష్ స్వామి మూలమూర్తి అమ్మవారికి సరస్వతీ దేవి అలంకరణలో పూజలు చేశారు. కుంకుమార్చన, అభిషేకం, ఒడి బియ్యం సమర్పించి మంగళ హారతి నిరాజనం చేశారు. అనంతరం భక్తులు దేవిని విద్యాధరి రూపంలో దర్శించుకుని మొక్కులు సమర్పించుకుంటున్నారు.