నటి సమంతపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఆమె వ్యాఖ్యలను నటుడు వెంకటేశ్ ఖండించాడు. ‘ఇతరుల వ్యక్తిగత పరిస్థితిని రాజకీయాల కోసం వాడటం నన్నెంతో బాధించింది. వ్యక్తిగత జీవితం, కళల పట్ల పరస్పర గౌరవం, అంకితభావంతో మా సినీ పరిశ్రమ ఏర్పడింది. బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి.. రాజకీయ లబ్ధి కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం. మీ చర్యలు, మాటలు స్ఫూర్తి నింపేలా ఉండాలని కోరుకుంటున్నా’ అని పేర్కొన్నాడు.