యాదాద్రి భువనగిరి: యాదాద్రి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ. జయరాజు భువనగిరిలోని సబ్ జైలును సందర్శించారు. జైలులో ఉన్న ఖైదీలతో మాట్లాడారు. వారు కోర్టుకు హాజరు అవుతున్నారా లేదా వారి కేసులలో న్యాయవాదులు లేనట్లయితే న్యాయ సహాయంకై న్యాయవాదులను నియమించడానికి దరఖాస్తు సమర్పించాలని తెలిపి, జైలులో ఏర్పాటు చేసిన న్యాయ సహాయ శిబిరాన్ని తనిఖీ చేశారు.