తమిళ హీరో కార్తీ, అరవింద్ స్వామి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘సత్యం సుందరం’. తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ సభ్యులు U సర్టిఫికెట్ జారీ చేశారు. ఈ మేరకు మేకర్స్ స్పెషల్ పోస్టర్ షేర్ చేశారు. 2డి ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై దర్శకుడు సి.ప్రేమ్ కుమార్ తెరకెక్కించిన ఈ సినిమా రేపు విడుదలవుతుంది.