W.G: పెనుమంట్ర మండలంలో ఏఎన్ఎం భాగ్య కుమారి, ఆశా సిబ్బంది ఆధ్వర్యంలో శుక్రవారం ఫ్రైడే డ్రైడే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామస్థులకు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ఇళ్ల వద్ద చెత్త నిలువలు ఉండరాదని, పనికిరాని వస్తువులు, పాడైపోయిన వస్తువులు ఉంచరాదని అన్నారు. వీటివల్ల దోమలు అధికమై విషజ్వరాలు వ్యాప్తి చెందుతాయని ప్రజలకు సూచించారు.