ఎన్టీఆర్ ‘దేవర’ సినిమా టికెట్లు అధిక ధరకు విక్రయిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని స్వర్ణ థియేటర్లో రెవెన్యూ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అదనపు షోలు, టికెట్ ధరల పెంపుపై థియేటర్ అనుమతులను పరిశీలించారు. సెకండ్ షోకు సంబంధించి ముందుగానే అధిక రేట్లకు అమ్మకాలు జరిపినట్లు అధికారులు గుర్తించారు.