కంగనా నటించిన ‘ఎమర్జెన్సీ’ సెన్సార్ అంశంపై ఇవాళ బాంబే హైకోర్టులో విచారణ జరిగింది. ఇటీవల ఈ మూవీ సెన్సార్ విషయంలో సెప్టెంబర్ 25లోగా ఒక నిర్ణయానికి రావాలని కోర్టు సెన్సార్ బోర్డును ఆదేశించింది. తాజాగా దీనిపై కోర్టులో విచారణ జరగ్గా.. మూవీలోని కొన్ని సన్నివేశాలను తొలగిస్తే సెర్టిఫికెట్ ఇస్తామని సెన్సార్ బోర్డు కోర్టుకు తెలిపింది. నిర్మాణ సంస్థ ఇందుకు సమయం కోరింది. ఈనెల 30లోగా నిర్ణయం తీసుకోవాలని సంస్థను కోర్టు ఆదేశించింది.