మన్యం: ప్రైవేట్ ఆసుపత్రులలో సేవలపై కమిటీని నియమించి తనిఖీలు చేయాలని పార్వతీపురం కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కలెక్టరేట్లో బుధవారం సమీక్షించారు. ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్న సౌకర్యాలు, ఆధునిక యంత్రాలు, మందులు గమనించాలన్నారు. ముఖ్యంగా అనిస్తేషియా సేవలు అందుబాటును నిశితంగా పరిశీలించి నివేదికలు తయారు చేయాలని ఆయన ఆదేశించారు.