ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ ఈనెల 27న విడుదల కానున్న నేపథ్యంలో గురువారం అర్ధరాత్రి మిడ్ నైట్ షోలకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. అయితే విశాఖలోని పూర్వీ డిస్ట్రిబ్యూటర్స్ సంస్థ స్వయంగా బెనిఫిట్ షోకు బ్లాక్‌లో టిక్కెట్లు విక్రయిస్తోంది. ఒక్కో టిక్కెట్‌ను ఏకంగా రూ.వెయ్యికి అమ్ముతోంది. ఈ వ్యవహారంపై విమర్శలు వచ్చినా.. థియేటర్లకు సినిమాలు ఇవ్వరన్న భయంతో యాజమాన్యాలు నోరుమెదపడం లేదు.