SKLM: కొత్తూరు ఎమ్మార్వో కార్యాలయం వద్ద బుధవారం నిరసన కార్యక్రమం చేపట్టినట్లు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు సిర్ల ప్రసాద్ తెలిపారు. భూముల రీ సర్వేలో అక్రమాలకు పాల్పడిన అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతూ స్థానిక ఎమ్మార్వో బి పాపారావుకు వినతిపత్రం అందించామని అన్నారు. నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలని కోరారు.