AP: వైసీపీ ప్రభుత్వం టీటీడీ విషయంలో అహంకారంతో వ్యవహరించిందని మంత్రి నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. ‘గత పాలకులు టీటీడీ టికెట్లు అమ్ముకునే శ్రద్ధ.. ప్రసాదంపై పెట్టలేదు. ఐదేళ్లుగా నాణ్యత లేని లడ్డూ ప్రసాదం తయారు చేశారు. సంబంధంలేని వ్యక్తులను పాలక మండలిలో నియమించారు. ఆలయ అభివృద్ధికి నిజాయతీగా పనిచేసే వారినే నియమిస్తాం. టీటీడీ ప్రక్షాళన సమయం ఆసన్నమైంది’. అని అన్నారు.