ఛత్తీస్‌ఘడ్‌లో మరో భారీ ఎన్కౌంటర్ జరిగింది. సోమవారం మధ్యాహ్నం నారాయణపూర్ జిల్లా అబూజ్మడ్ అటవీప్రాంతంలో మావోయిస్టులకు, పోలీసులకు మధ్య జరిగిన ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారు. అనంతరం భద్రతా బలగాలు ఘటనా స్థలానికి చేరుకొని ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.