TG: హైదరాబాద్ కూకట్పల్లి నల్లచెరువులో హైడ్రా కూల్చివేతల ప్రాంతాన్ని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ పరిశీలించారు. బాధితులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. బుల్డోజర్లతో షెడ్లను కూలగొట్టి కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పేదలనే టార్గెట్ చేసి ప్రభుత్వం హీనంగా ప్రవర్తిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాన్యులకు శని, ఆదివారాల్లో కోర్టులు అందుబాటులో ఉండవని కూల్చివేతలు చేస్తున్నారని సీరియస్ అయ్యారు.