AP: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ అంశంలో నిజనిజాలు వెలికితీయాలని న్యాయవాది పొన్నవోలు సుధాకర్ ఆరోపించారు. సిట్ విచారణతో నిజాలు బయటకు వచ్చే అవకాశం లేదన్నారు. సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయవాది పర్యవేక్షణలో ఆహార నిపుణులతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. నెయ్యి పంపిణీకి సర్టిఫికెట్ ఉంటేనే ట్యాంకర్లు తిరుమలకు వస్తాయని, టెస్టుల్లో ఫెయిల్ అయితే వాటిని వెనక్కి పంపిస్తారని తెలిపారు.