TG: ఈ మధ్య కాలంలో కుక్కల దాడులు పెరిగిపోతున్నాయి. చిన్నారులు, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా అందరిపై దాడి చేస్తున్నాయి. తాజాగా కరీంనగర్ మహిళా కళాశాల సమీపంలో బాలుడితో నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళపై వీధి కుక్కలు దాడికి పాల్పడ్డాయి. వెంటనే అది గమనించిన స్థానికులు కుక్కలను తరిమికొట్టారు. ఈ సందర్బంగా అధికారులపై స్థానికులు మండిపడ్డారు. కుక్కల నుంచి తమకు రక్షణ కల్పించాలని కోరారు.