TG: దుర్గం చెరువు పరిసర ప్రాంతాల్లోని నిర్వాసితులకు హైకోర్టులో ఊరట లభించింది. ఆ చెరువు పరిధిలోని కూల్చివేతలపై కోర్టు స్టే ఇచ్చింది. 2014లో జారీ చేసిన ప్రిలిమినరీ నోటిఫికేషన్‌పై చెరువు నిర్వాసితులు వ్యక్తం చేసిన అభ్యంతరాలను లేక్ ప్రొటెక్షన్ కమిటీ పరిగణలోకి తీసుకోవాలని హైకోర్టు పేర్కొంది. అక్టోబర్ 4 నుంచి 6వారాల లోపు ఫైనల్ నోటిఫికేషన్ జారీ చేయాలని లేక్ ప్రొటెక్షన్ కమిటీకి ఆదేశాలు జారీ చేసింది.