AP: తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై దర్యాప్తు జరపాలని బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి పిటిషన్ వేశారు. ఆధారాలు లేకుండా సీఎం ఆరోపణలు చేశారని తెలిపారు. విచారణ కోసం కమిటీ ఏర్పాటు చేయాలని స్వామి కోరారు. ఇదే వివాదంలో వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి కూడా మరో పిటిషన్ వేశారు. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి లేదా నిపుణులతో విచారణ చేయించాలని కోరారు.