AP: రక్త హీనత సమస్యను అధిగమించడమే ధ్యేయంగా అడుగులు వేస్తున్నామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఆరోగ్యవంతమైన సమాజమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ప్రతి చిన్నారి, మహిళకీ పోషకాహారం అందించి తీరుతామని స్పష్టం చేశారు. మచిలీపట్నం పోషకాహార మాసోత్సవాల్లో పాల్గొన్న మంత్రి కొల్లు రవీంద్ర ఈ వ్యాఖ్యలు చేశారు.