ఆడవాళ్లకు పీరియడ్స్ సమయంలో నొప్పి, రక్తస్రావం వల్ల నీరసం వంటి సమస్యలు ఎదురవుతాయి. అయితే అలాంటి సమయంలో ఆహారంపై దృష్టి సారించటం అవసరమని నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం కాల్షియం, ఐరన్, ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకోవాలి. అల్లం, వెల్లుల్లి, పసుపు, మిరియాలు వంటివి ఆహారంలో చేర్చుకుంటే ఆ సమయంలో వచ్చే నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. మెంతులు నానబట్టి ఆ నీటిని తాగాలి. రాగులు, ఉసిరి, గుడ్లు, పాలు, జొన్నలు, మినుములు, పండ్లు తీసుకోవాలి.