TG: ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు కష్టాలు తెచ్చి పెడుతుందని మాజీమంత్రి హరీశ్ రావు అన్నారు. ‘లక్షల ఎకరాల్లో పంట ఎండిపోతోంది. ఖమ్మం నుంచి ముగ్గురు మంత్రులు ఉన్నా అక్కడ కూడా పంట పొలాలకు నీరివ్వలేని దుస్థితి. రైతులకు రుణమాఫీ చేస్తామని భద్రాద్రి రాముని మీద ఒట్టేసి మాట తప్పారు. ఈ ప్రభుత్వాన్ని క్షమించమని భద్రాద్రి రామయ్యను వేడుకుంటున్నాను. త్వరలో ఖమ్మంలో పర్యటించి అక్కడి రైతులకు మనోధైర్యాన్నిచ్చే ప్రయత్నం చేస్తాం’ అని తెలిపారు.