AP: సీఎం చంద్రబాబు 100 రోజుల పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని మంత్రి టీజీ భరత్ అన్నారు. కర్నూలు జిల్లా బుధవారపేటలో ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. “చంద్రబాబు, లోకేశ్ జీవితాలు ప్రజాసేవకే అంకితం చేశారు. ప్రజల కోసం నిరంతరం కష్టపడే నాయకుడు చంద్రబాబు. ఆయన సీఎంగా ఉండటం వల్లే వరదల నుంచి ప్రజలు త్వరగా బయటపడ్డారు. ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్‌కు పరిశ్రమలు తీసుకొస్తాం” అని పేర్కొన్నారు.