AP: డిసెంబర్ నెల కోటాకు సంబంధించి అంగ ప్రదక్షిణం టోకెన్లను ఈ ఉదయం 10గంటలకు టీటీడీ విడుదల చేసింది. 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ టికెట్లు విడుదల చేయనుంది. మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, వికలాంగులకు దర్శన టికెట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉంచనుంది. కాగా.. రేపు ఉదయం 10గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు, మధ్యాహ్నం 3గంటలకు వసతి గదుల కోటా టికెట్లు విడుదల కానున్నాయి.