ASR: సెప్టెంబర్ 23.. 2018.. మన్యం ప్రజలు మరిచిపోలేని రోజు. మాజీ ఎమ్మెల్యేలు కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోమ ఇద్దరు కీలక నేతలను గిరిజనం పోగొట్టుకున్న రోజు. డుంబ్రిగుడ మండలంలోని లివిటిపుట్టు వద్ద మావోయిస్టులు ఇద్దరు నేతలను హతమార్చి నేటికి ఆరేళ్లు గడుస్తోంది. నాటి సంఘటనను గిరిజనులు తలుచుకొని ఇప్పటికీ విలపిస్తున్నారు.