సాధారణంగా డ్రైఫ్రూట్స్‌ని నీటిలో నానబెట్టి తింటాం. అయితే జీడిపప్పు, బాదం, ఎండుద్రాక్షలను తేనెలో నానబెడితే వాటిలోని పోషకాలు రెట్టింపు అవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తేనెలో నానబెట్టిన డ్రైఫ్రూట్స్ తింటే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. మెదడు పనితీరు మెరుగుపడుతుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. జుట్టు, చర్మం ఆరోగ్యంగా ఉంటాయి. కండరాలు, ఎముకలు బలంగా మారతాయి. శరీరానికి తక్షణ శక్తి అంది.. రోజంతా ఉల్లాసంగా ఉంటుంది.