AP: తిరుమల శ్రీవారి లడ్డూ అపవిత్రంపై ఐజీ స్థాయి అధికారితో రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. లడ్డూ అపవిత్రానికి గల కారణాలతోపాటు అధికార దుర్వినియోగంపైనా సిట్ విచారణ జరపనుంది. సిట్ నివేదిక ఆధారంగా సీరియస్ యాక్షన్ ఉంటుందని సీఎం చంద్రబాబు వెల్లడించారు. లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగంలో భాగమైన ఏ ఒక్కరినీ వదిలేది లేదని అన్నారు. తప్పు చేసిన వారికి శిక్ష పడాల్సిందేనని స్పష్టం చేశారు.