SRD: మండల కేంద్రమైన చౌటకూర్లోని హనుమాన్ దేవాలయంలో భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో హనుమాన్ చాలీసా పారాయణం ఆదివారం నిర్వహించారు. భక్తులు భక్తిశ్రద్ధలతో హనుమాన్ చాలీసాను 21సార్లు చదివారు. అనంతరం హనుమంతునికి మన్యసూక్త సహిత అభిషేకం, ప్రత్యేక పూజా కార్యక్రమాలను జరిపించారు. స్వామి వారికి మహా హారతి కార్యక్రమాన్ని నిర్వహించి మంగళ నైవేద్యాలను సమర్పించారు.