JGL: జిల్లాలో విష జ్వరాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 30 గ్రామపంచాయతీలు ఉండగా ఫాగింగ్ యంత్రాలు మూలన పడటంతో దోమలు వ్యాపిస్తున్నాయి. దీంతో జనం జ్వరాలు బారిన పడుతున్నారు. దోమలు, పారిశుద్ధ్య నియంత్రణ చర్యలు కరవయ్యాయి. అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్భాటంగా ప్రకటిస్తున్నా ఆచరణలో కనిపించడం లేదు.