ఖమ్మం జిల్లా: టేకులపల్లి మండలంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ భాస్కర్ నాయక్ సులానగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు సలహాలు ఇచ్చారు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలందరూ అప్రమతంగా ఉండాలన్నారు. వైద్య సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు.