NLR: సంగం మండలం దువ్వూరు గ్రామంలోని ఆస్థాన ఏ నూరియాలో హజరత్ ఆల్ హజ్ షేక్ షా భాషా నూరి సాహెబ్ ఆధ్వర్యంలో మొహమ్మద్ ప్రవక్త సొల్లల్లాహు అలైహి వసల్లెం వారి గంధమోత్సవం వైభవంగా జరిగింది. ముందుగా మేళతాళాల నడుమ గ్రామంలో గ్రంధాన్ని ఊరేగింపు నిర్వహించారు. అనంతరం ముస్లిం మత పెద్దలు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి భక్తులకు గంధాన్ని పంచిపెట్టారు.