NLR: ఇందుకూరుపేట మండలంలోని కొరుటూరు పాలెం అంగన్వాడీ కేంద్రంలో శనివారం పౌష్టికాహార ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గర్భవతులు బాలింతలు తప్పకుండా పోషకాహారం తీసుకోవాలని లేదంటే పుట్టే పిల్లలు బలహీనంగా, అనారోగ్యంగా జన్మిస్తారన్నారు. కనుక మంచి పోషకాహారం తీసుకొని ఆరోగ్యకరమైన పిల్లలకు జన్మనివ్వాలని తెలియజేశారు.