తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ Xలో చేసిన ఒక పోస్ట్ దేశవ్యాప్తంగా చర్చకు కేంద్రబిందువు అయ్యింది. పవన్, “తిరుపతి బాలాజీ ప్రసాదంలో జంతు కొవ్వు (ఫిష్ ఆయిల్, పంది కొవ్వు, బీఫ్ కొవ్వు) కలిసినట్లు కనుగొన్నందుకు మేము తీవ్రంగా కలత చెందాము. టీటీడీ బోర్డుకు గత వైస్సార్సీపీ ప్రభుత్వంలో నిబంధనలపై సమాధానాలు అందించాలి,” అని పేర్కొన్నారు. ఆయన ఈ విషయంపై జాతీయ స్థాయిలో “సనాతన ధర్మ రక్షణ బోర్డు” ఏర్పాటుకు పిలుపునిచ్చారు.
ఈ పోస్ట్‌కు సినీ నటుడు, రాజకీయ వ్యాఖ్యాత ప్రకాష్ రాజ్ స్పందించారు. ఆయన, “మీరు ఉప ముఖ్యమంత్రి గా ఉన్న రాష్ట్రంలో ఇది జరుగుతోంది. దోషులను కనుగొని కఠిన చర్య తీసుకోండి. ఎందుకు మీరు ఆందోళనలు పుట్టించి ఈ విషయాన్ని జాతీయ స్థాయిలో హుంగామ సృష్టిస్తున్నారు,” అన్నారు. ఆయన, “దేశంలో మనకు కావాల్సిన చొమ్మునల్ గొడవలు ఉన్నాయి (కేంద్రంలో ఉన్న మీ మిత్రులకు ధన్యవాదాలు) అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
ప్రకాశ్ రాజ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇంటర్నెట్లో విపరీతంగా వైరల్ అయ్యాయి. పవన్ కళ్యాణ్ అభిమానులు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారం, రాజకీయ దృష్టికోణం నుండి, తెలుగు రాష్ట్రాలలో తీవ్ర చర్చలకు దారితీస్తోంది. ప్రకాష్ రాజ్, పవన్ కళ్యాణ్ మరియు NDA ప్రభుత్వంపై చేసిన ఈ ప్రశ్నలు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరింత ఉత్కంఠతను కలిగిస్తున్నాయి.