బంగారం అంటే ఎవరికీ ఇష్టం ఉండదు? పేద, మధ్యతరగతి, ధనిక ఇలా స్థాయితో సంబంధం లేకుండా ప్రతీవారు తమ సంపాదనతో మొదట కొనాలని అనుకునేది బంగారం. ఎందుకంటే ఏళ్ళు గడిచేకొద్దీ బంగారం విలువ పెరుగుతూనే ఉంటుంది. కొన్ని వందల ఏళ్ళ నుంచి బంగారాన్ని ఇష్టముగా ధరించే సంస్కృతి దేశంలో ఉంది. పండగలకు, ఇంట్లో శుభకార్యాలకు తప్పనిసరిగా కొనే విలువైన వస్తువుగా బంగారం మారిపోయింది. రెండు రోజుల క్రితం ప్రకటించిన కేంద్ర యూనియన్ బడ్జెట్ లో ఒక కీలక ప్రకటన బంగారం వ్యాపారస్తులకు అలాగే కొనుగోలు చేసే వినియోగదారులకు చాలా మంచి చేసిందనే చెప్పాలి
కేంద్ర ప్రభుత్వం బంగారం దిగుమతులకు వేసే కస్టమ్స్ డ్యూటీ ట్యాక్సును తగ్గించడం ద్వారా బంగారం రేట్లు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. గత వారం రోజుల్లో బంగారం ధర తులంకి 4000 మేర పడిపోయింది. బడ్జెట్ రోజునే 3000 పడిపోవడం గమనార్హం, దీంతో వివియోగదారులు బంగారామ్ కొనుగోలుకు ఇదే మంచి తరుణం అని భావించి గోల్డ్ షాపులకు క్యూ కడుతున్నారు.
బంగారం కంటే వెండి ధర బాగా తగ్గింది.. గత పదిరోజుల్లో వెండి ధర రూ. 10,000/- తగ్గింది.. కిలో వెండి 99 వేళా రూపాయిలు నుంచి ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్ లో కిలో వెండి ధర రూ. 89,000/- గా ఉంది.