నాలుగేళ్లకోసారి జరిగే సమ్మర్ ఒలింపిక్స్ కోసం ప్రపంచం మొత్తం ఎదురుచూస్తుంది. ఒలింపిక్స్ లో ఒక్కసారి ఆడితే చాలు, పతాకం గెలిస్తే జీవితం సార్ధకం అయినట్టే అని ప్రతీ క్రీడాకారుడు, అథ్లెట్ భావిస్తారు. ఒలింపిక్స్ అంటే అథ్లెట్లు అంత ప్రత్యేకంగా, ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. ఈసారి ఈ మెగా ఈవెంట్ పారిస్ ఆతిథ్యమిచ్చింది. నేటి (జూలై 26) నుంచి ప్రారంభం అయ్యి 16 రోజులు పాటు (ఆగష్టు 11 వరకు) జరిగే ఈ మహా సంరంభంలో ఎన్ని దేశాలు, ఎంతమంది అథ్లెట్లు పాల్గునంటున్నారో, ఎన్ని ఈవెంట్స్ కు మెడల్స్ అందజేస్తారో చూద్దాం
Olympics 2024లో మొత్తం 32 దేశాల నుంచి 10,500 అథ్లెట్లు పాల్గొనబోతున్నారు. మొత్తం 32 క్రీడాంశాల్లో 329 విభాగాల్లో పతకాల గురించి పోటీలు జరగబోతున్నాయి. భారత కాలమానం ప్రకారం ఈరోజు రాత్రి 11 గంటలకు ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలతో మొదలవుతుంది. ఈసారి ఓపెనింగ్ సెర్మనీ ప్రత్యేకంగా జరగనుంది. ఎప్పటిలాగా ఓపెన్ స్టేడియంలో కాకుండా, పారిస్ నగరం మీదుగా వెళ్లే సెయిన్ నదిపై వేడుకలు నిర్వహించనున్నారు. సెయిన్ నదిపై 100 పడవలపై ఈ సెర్మనీ జరగనుంది. 10,000 అథ్లెట్లు పడవలపై 6 కిలోమీటర్లు పెరేడ్ చేయనున్నారు. ఓపెనింగ్ సెర్మనీలో భారత క్రీడాకార బృందాన్ని స్టార్ బాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు, సీనియర్ టేబుల్ టెన్నిస్ ప్లేయర్ శరత్ కమల్ నడిపిస్తారు. ఈ ఇరువురు ఫ్లాగ్ బారియర్స్ గా ఎంపికయ్యారు.
ఈ ఒలింపిక్స్ లో భారత్ తరుపున మొత్తం 117 క్రీడాకారులు 16 క్రీడల్లో పోటీ పడుతున్నారు. 117లో అత్యధికంగా అథ్లెటిక్స్ లో 29 మంది, షూటింగ్ లో 21 మంది పతకాల కోసం పోటీపడుతున్నారు. టేబుల్ టెన్నిస్ ఆటగాడు శరత్ కమల్ కు ఇవి 5వ ఒలింపిక్స్, పీవీ సింధుకు ఇవి వరుసగా 3వ ఒలింపిక్స్.
మన దేశంలో స్పోర్ట్స్ 18 1SD, స్పోర్ట్స్ 18 1 HD చానెల్స్ లో ఒలింపిక్స్ లైవ్ తెల్లకాస్ట్ చూడొచ్చు. ఓటీటీలో జియో సినిమాలో ఫ్రీగా వీక్షించొచ్చు