»Paris Races To Control Its Rat Population Ahead Of Olympics
Paris Olympics : పారిస్ ఒలింపిక్స్‌లో తలనొప్పిగా మారిన ఎలుకల బెడద
పారిస్ ఒలింపిక్ గేమ్స్ ఓ వైపు అట్టహాసంగా మొదలవుతున్నాయి. మరో వైపు అక్కడ ఎలుకలు విపరీతంగా ఉండటంతో వాటిని కంట్రోల్ చేయడానికి అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయండి.
Rats In Paris : పారిస్‌లో ప్రతిష్ఠాత్మక క్రీడా పోటీలైన ఒలంపిక్స్( Olympics) అంగరంగ వైభవంగా ప్రారంభం అవుతున్నాయి. నేడు (జూలై 25న) ఈ క్రీడలు మొదలయ్యాయి. శుక్రవారం ఒలింపిక్ గేమ్స్ ప్రారంభోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించనున్నారు. ఈ క్రీడలను వీక్షించడానికి దేశ, విదేశాల నుంచి ఎందరో ప్రేక్షకులు పారిస్‌కు వస్తున్నారు. అయితే పారిస్ నగరంలో ఇప్పుడు ఎలుకల బెడదతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
పారిస్‌కు( paris) వచ్చే సందర్శకులకు ఎలుకల్ని కనిపించకుండా చేయడం అనేది ఇప్పుడు అక్కడి అధికారులకు పెద్ద సవాల్‌గా మారింది. వేలకోట్లు ఖర్చు పెట్టి మరీ ఈ మూషికాలను సందర్శకుల కళ్లల్లో పడకుండా చేసేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. క్రీడా నగరాన్ని ఏర్పాటు చేసే సమయంలోనే ఉచ్చులు వేసి వాటిని చాలామటుకు ఏరివేశారు. అయినా కూడా వీటి బెడద తీవ్రంగానే ఉందని స్థానిక అధికారులు చెబుతున్నారు.
ఈ విషయమై పారిస్( paris) డిప్యూటీ మేర్ అన్నెక్లేరీ బౌక్స్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. కొన్ని రకాల కెమికళ్లను ఉపయోగించి వాటిని నిర్మూలించామని చెప్పారు. అలాగే ఉచ్చులను బిగించి వాటిని ఏరివేస్తున్నట్లు వెల్లడించారు. అయినా సరే ఇవి ఇంకా నగరంలో ఎక్కువగానే ఉన్నట్లు చెప్పుకొచ్చారు.