మెగాస్టార్ చిరంజీవి తన శైలికి భిన్నంగా ఒక డిఫరెంట్ సబ్జెక్టును ఎంచుకున్నారు. విశ్వంభర తరువాత చిరు చేయబోయే సబ్జెక్టు ఇదే అని అంటున్నారు. మెగాస్టార్ పాలిటిక్స్ నుంచి సినిమాలకి రీఎంట్రీ ఇచ్చాక వరుస హిట్లు తరువాత గాడ్ ఫాదర్, భోళాశంకర్ తో ఫ్యాన్స్ నిరాశ చెందిన మాట వాస్తవం.
అయితే ఇప్పుడు గాడ్ ఫాదర్ తీసిన మోహన్ రాజాతో మరో సినీమా చేయడానికి బాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఈసారి రిమేక్లు కాకుండా స్ట్రెయిట్ సబ్జెక్టు తో వస్తున్నట్టు తెలుస్తుంది. BVS రవి ఈ సినిమాకు కథ సమకూరుస్తున్నట్టు తెలుస్తుంది. చిరంజీవి ఇప్పటివరకు చేయని ఒక డిఫరెంట్ సబ్జెక్టుతో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుంది. ఒక మిడిల్ ఏజ్డ్ పెళ్లి అయిన పర్సన్ రోల్ లో చిరంజీవి కనిపిస్తారట.
మోహన్ రాజ తొలి సినీమా హనుమాన్ జంక్షన్ మంచి ఎంటర్టైనర్. తెలుగు ఇండస్ట్రీ టాప్ 10 కామెడీ హిట్స్ లో ఈ సినిమా ఉంటుంది. ఆ తరువాత తని ఒరువన్ (తెలుగులో ధృవగా రీమేక్) తో సీరియస్ థ్రిల్లర్ తో కూడా భారీ హిట్ సాధించాడు. మరి చిరంజీవి కోసం సీరియస్ సబ్జెక్టు చేస్తున్నారా? కామిక్ టైమింగ్ ఉన్న రోల్ డిజైన్ చేస్తున్నారో చూడాలి. ఈ సినిమాకు రామ్ చరణ్ కొణిదల ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తారు.