»Kalki 2898 Ad Reduced Kalki Collections But Sensation
Kalki 2898 AD: తగ్గిన ‘కల్కి’ కలెక్షన్స్.. కానీ సెన్సేషన్!
ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ నిర్మాణంలో.. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన 'కల్కి 2898ఏడి' సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను రాబట్టింది. హిందీలో కూడా దుమ్ముదులిపేస్తోంది. అయితే ఇప్పుడు కలెక్షన్స్ తగ్గిన.. సెన్సేషనల్‌గా నిలిచేలా ఉంది.
Kalki 2898 AD: Reduced 'Kalki' Collections.. But Sensation!
Kalki 2898 AD: ‘కల్కి 2898 ఏడి’ సినిమా నాలుగో వారంలో కూడా దూసుకుపోతోంది. ఇప్పటికే వెయ్యి కోట్లు రాబట్టిన కల్కి.. 1100 కోట్లకు చేరువలో ఉంది. ఇప్పటికే పలు రికార్డులు బద్దలు కొట్టిన కల్కి.. మరో ల్యాండ్ మార్క్‌ను రీచ్ అయ్యేలా ఉంది. ఇటీవల వచ్చిన భారతీయుడు 2కి నెగెటివ్ టాక్ రావడంతో.. కల్కికి తిరుగులేకుండా పోయింది. ఈ వారం రిలీజ్ అయిన సినిమాలు కూడా కల్కి కలెక్షన్స్‌ను డ్రాప్ చేయలేకపోయాయి. అసలు ఈ మూడు వారాల్లో కల్కికి పోటీ ఇచ్చే సినిమా ఒక్కటి కూడా రాలేదు.
హిందీలో.. అక్షయ్ కుమార్ ‘సర్ఫిరా’ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ.. ఆడియెన్స్ మాత్రం థియేటర్లకు వెళ్లడం లేదు. అయితే.. బాలీవుడ్లో ఈ వారం రిలీజ్ అయిన ‘బ్యాడ్ న్యూస్’ మాత్రం మంచి టాక్ తెచ్చుకుంది. విక్కీ కౌశాల్, త్రిప్తి డిమ్రి జంటగా నటించిన ఈ సినిమాతో.. కల్కి వసూళ్లు కాస్త తగ్గినా.. హిందీలో మాత్రం సెన్సేషనల్ మార్క్‌కు చేరువలో ఉంది. ఇప్పటి వరకు హిందీ బెల్ట్‌లో కల్కి సినిమాకి 270 కోట్ల వరకు కలెక్షన్స్ వచ్చాయి. దీంతో.. ఈ ఏడాదిలో బాలీవుడ్లో హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా కల్కి నిలిచింది.