Manorama Khedkar: ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ తల్లి అరెస్టు
అడ్డగోలుగా ఐఏఎస్ సెలక్ట్ అయ్యారని ట్రెయినీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్‌పై ఆరోపణలు ఉన్నాయి. ఇదిలా ఉండగా అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నారనే ఆరోపణలతో ఆమె తల్లిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Manorama Khedkar: ట్రెయినీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్ గురించి అందరికీ తెలిసిందే. అడ్డగోలుగా ఐఏఎస్ సెలక్ట్ అయ్యారనే ఆరోపణలతో ఈమధ్య వైరల్ అవుతోంది. అయితే ఈమె తల్లి మనోరమ ఖేడ్కర్ అరెస్టు అయ్యారు. అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నారనే ఆరోపణలతో పోలీసులు ఆమె తల్లిని అరెస్టు చేశారు. మనోరమ గ్రామస్థులను పిస్తోల్‌తో బెదిరిస్తున్నట్లు వీడియో వైరల్ అయ్యింది. ఓ భూవివాదం విషయంలో ఆమె పిస్టోల్‌తో కొందరిని బెదిరింది. ఈ వ్యవహారంలో ఖేడ్కర దంపతులతో పాటు మరో ఐదుగురిపైనా కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.
#WATCH | Maharashtra | Manorama Khedkar, who was detained from Mahad, brought to Pune
She is the mother of IAS trainee Puja Khedkar. She is facing action after she was seen pointing a pistol at farmers in a purported viral video. pic.twitter.com/gUGa4nTzLG
విచారణకు పిలిచినా ఆ దంపతులు రాలేదని, మొబైల్ ఫోన్లు స్విచాఫ్ చేశారు. ఇలా తప్పించుకుని తిరుగుతున్న వాళ్లను పోలీసులు రాయ్‌గఢ్‌లోని ఓ లాడ్జ్‌లో అదుపులో తీసుకున్నారు. పూజా తండ్రి దిలీప్ ఖేడ్కర్‌పై కూడా అవినీతి ఆరోపనలు ఉన్నాయట. ప్రభుత్వ అధికారిగా ఉన్న సమయంలో అతను రెండుసార్లు సస్పెన్షన్‌కు గురయ్యారు. 2023 యూపీఎస్సీ ఎగ్జామ్‌లో 841 ర్యాంక్ సాధించిన ఆమె శిక్షణలో ఉన్నారు. ఆమెపై అధికార దుర్వినియోగ ఆరోపణలు రావడంతో ప్రస్తుతం ఆమె శిక్షణపై సస్పెన్షన్ విధించారు. ఓబీసీ కోటాపై సీటు సంపాదించడం, ప్రైవేటు ఆడీ కారుకు బీకన్ వాడడం లాంటి ఆరోపణలు ఉన్నాయి.