అరుదైన ఫీట్‌తో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో తన పేరును లిఖించుకున్నాడు ఈ పాకిస్థాన్ కుర్రాడు. కేవలం 30 సెకన్లలో 39 కూల్ డ్రింగ్స్ టిన్లను తన నుదిటితో పగలగొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.
Guinness record breaking 39 tins in 30 seconds.. Video viral
Guinness Record: ఏదైనా అరుదైన ట్యాలెంట్ ఉంటే గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు సాధిస్తారన్న విషయం మనకు తెలుసు. అలా ప్రపంచవ్యాప్తంగా చాలా మందికి గిన్నిసు రికార్డులో స్థానం సంపాదించుకోవాలనే ఆశ ఉంటుంది. తాజాగా పాకిస్థాన్‌కు చెందిన ముహమ్మద్ రషీద్ అనే వ్యక్తి ఓ రికార్డును నెలకొల్పాడు. మహ్మాద్ రషీద్ మార్షల్ ఆర్ట్స్‌లో నైపుణ్యం ఉంది. ఆయన చేస్తున్న ఫీట్లు కూడా చాలా ప్రమాద కరంగా ఉంటాయి. అందులో భాగంగా అర నిమిషంలో 39 కూల్ డ్రింక్స్ టిన్లను పగలగొట్టి రికార్డు సృష్టించాడు. దీంతో రషీద్ పేరు గిన్నిస్ రికార్డులో లిఖించారు. కేవలం 30 సెకన్లలో అత్యధికంగా 39 డ్రింక్ క్యాన్లను నుజ్జు చేసిన వ్యక్తిగా చరిత్ర సృష్టించాడు.
ఈ ఫీట్‌ను రషీద్ మే 19 2024న ప్రదర్శించాడు. దానికి సంబంధించిన వీడియోను గిన్నిస్ బుక్ తాజాగా ఇన్ స్టాగ్రామ్ పేజీలో అప్లోడ్ చేసింది. వీడియోలో చూసుకుంటూ రెండు టేబుల్స్‌పై కూల్ డ్రింక్ క్యాన్లు వరుసగా పేర్చారు. వాటి వెనుక రషీద్ నిలబడి ఉన్నారు. టైమర్ మొదలవ్వగానే తన నుదిటితో బలంగా వాటిని కొట్టడం మొదలు పెట్టాడు. దీంతో క్యాన్లు బద్దలై కూల్ డ్రింక్స్ బయటకు చిమ్ముతున్న దృష్యాన్ని చూడొచ్చు. అలా 30 సెకన్లలో 39 కూల్ డ్రింక్స్‌ను బద్దలు కొట్టాడు. అయితే మహ్మాద్ రషీద్ ఇదివరకే ఇలాంటి ఒక ఫీట్ చేసి రికార్డు సాధించాడు. ఇక నిమిషంలో 58 కూల్ డ్రింక్ క్యాన్లను నుదిటిపై పగలగొట్టి రికార్డు సృష్టించాడు.
రషీద్ సాధించిన ఈ రికార్డుపై నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. సాధారణంగా ఇలాంటి యాక్ట్స్ అన్ని నిపుణుల పర్యవేక్షణలో చేస్తారు. రషీద్ ఎలాగో శిక్షణ పొందాడు కాబట్టి అతను అలవోకగా ఈ సాహసం చేస్తారు. కానీ దీన్ని చాలా మంది తప్పుబడుతున్నారు. అతన్ని ఆదర్శంగా తీసుకొని చిన్నపిల్లలు ఇలా చేస్తే బ్లెడ్ వస్తుంది అని కామెంట్లు చేస్తున్నారు. నిజానికి రషీద్‌కు కూడా ఆ టిన్స్ అన్ని పగలగొట్టిన తరువాత అతని నుదిటిపై రక్తం రావడం వీడియోలో చూడవచ్చు. దీనిపై ఒక నెటిజన్ స్పందిస్తూ.. గిన్నీసు రికార్డు సర్టిఫికెట్తో పాటు మనీ కూడా ఇచ్చింటారు, ఎందుకంటే అతనికి గాయం అయింది కదా వైద్యఖర్చులకు అని రాసుకొచ్చాడు. ఇలాంటి సాహసాలను మాత్రం నిపుణులు లేకుండా ఎవరు ఇంటి దగ్గర ప్రయత్నించొద్దని నెటిజన్లు సూచిస్తున్నారు.