»Prabhas Special Thanks Video For Fans Kalki Kalki 2898 Ad
Prabhas : మీరు లేకపోతే నేను జీరో.. ‘స్వీట్ నోట్’ విడుదల చేసిన ప్రభాస్
కల్కి 2898 ఏడీ సక్సస్ విషయంలో ప్రభాస్ చాలా ఆనందంగా ఉన్నారు. ఓ వీడియో ద్వారా అభిమానులకు ‘లవ్యూ సో మచ్’ అంటూ కృతజ్ఞతలు తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్లో వైరల్‌గా మారింది. దానికి సంబంధించిన విశేషాలను ఇక్కడ చదివేయండి.
Prabhas Special Thanks Video : అభిమానుల గుండెల్లో డార్లింగ్‌గా నిలిచిపోయిన ప్రభాస్(Prabhas) ఓ వీడియో ద్వారా ఫ్యాన్స్ అందరికీ కృతజ్ఞతలు చెప్పారు. ‘మీరు లేకపోతే నేను జీరో’ అంటూ మాట్లాడారు. తన కల్కి 2898 ఏడీని( kalki 2898 ad) ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఇంత పెద్ద మూవీ కోసం ప్రొడ్యూసర్ అశ్వినీదత్ పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టడం మామూలు విషయం కాదన్నారు. ఆయన అంత డబ్బులు ఖర్చు పెడుతుంటే తనకు టెంక్షన్గా ఉండేదన్నారు. అయితే అశ్వినీ దత్ మాత్రం ఖర్చు విషయంలో ఎప్పుడూ వెనకాడలేదని అన్నారు. ఈ చిత్రం పెద్ద సక్సస్ అవుతుందని తనకు తెలుసునని చెప్పేవారని ప్రభాస్ గుర్తు చేసుకున్నారు.
ఇలాంటి చిత్రంలో నటించేందుకు తనకు అవకాశం కల్పించినందుకు ప్రొడ్యూసర్ అశ్వినీదత్‌కు, అలాగే దర్శకుడు నాగ్ అశ్విన్‌కు ధన్యవాదాలు తెలిపారు. భారతీయ సినిమాలో లెజెండ్స్‌గా ఉన్న అమితాబ్ బచ్చన్, కమలహాసన్ లాంటి వారితో నటించే అవకాశాన్ని కల్పించినందుకు మూవీ థాంక్స్ చెప్పారు. వారి సినిమాలను చూస్తూ తాను ఎదిగానని అన్నారు. అలాంటి వారితో కలిసి నటించే అవకాశం రావడం గొప్ప విషయమన్నారు.
దీపిక పదుకొణెకు సైతం ప్రభాస్(Prabhas) ధన్యవాదాలు తెలిపారు. ‘మోస్ట్ గాడ్జియస్ లేడీ’ అంటూ కితాబిచ్చారు. సినిమా పార్ట్2లో మనం అంతా మళ్లీ కలిసి నటిస్తున్నాం. అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అని చెబుతూనే చివర్లో కూడా మళ్లీ ఫ్యాన్స్‌కి థ్యాంక్యూ చెప్పారు. ‘స్వీట్ నోట్’ అనే పేరుతో ఈ వీడియోని వైజయంతి మూవీస్ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో క్షణాల్లోనే నెట్టింట వైరల్‌గా మారింది. మరింకెందుకు ఆలస్యం దానిపై మీరూ ఓ లుక్కేసేయండి.
A sweet note from our Bhairava, Karna a.k.a #Prabhas, as we celebrate the blockbuster success of #Kalki2898AD ❤️