A case has been registered against hero Raj Tarun at Narsing police station
Raj Tarun: గత వారం రోజులుగా టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ పేరు మీడియాలో వినిపిస్తుంది. తన మాజీ ప్రియురాలు పోలీసులు స్టేషన్లో ఫిర్యాదు చేయడమే ఇందుకు కారణం. తిరగబడరాస్వామి సినిమా హీరోయిన్ మాల్వీ మల్హోత్రాతో, రాజ్ తరుణ్ ప్రేమలో ఉండి తనను వదిలేసి వెళ్లిపోయాడంటూ నటి లావణ్య నార్సింగి పోలీసులను ఆశ్రయించింది. తన ఫిర్యాదును తీసుకున్న పోలీసులు తగిన ఆధారాలు అందించాలని లావణ్యకు నోటీసులు పంపారు. ఈ నేపథ్యంలో అందుకు సంబంధించిన ఆధారాను పోలీసులు ఇచ్చింది.
తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు లావణ్యతో రాజ్ తరుణ్ సన్నిహితంగా ఉన్న 170 ఫోటోలు, కొన్ని వీడియో, ఆడియో క్లిప్స్ కూడా అందించారు. అంతే కాదు రాజ్ తరుణ్ తనను విడిసి వెళ్లిన తరువాత మానసికంగా ఎంతో కుంగిపోయినట్లు పోలీసులతో విన్నవించారు. ఎవిడెన్స్ తీసుకున్న నార్సింగ్ పోలీసులు తాజాగా రాజ్ తరుణ్‌పై సెక్షన్ 493, తదితర సెక్షన్ల కింద కేసు ఫైల్ చేశారు. రాజ్ తరుణ్, తాను పదేళ్ల క్రితమే పెళ్లి చేసుకున్నట్లు లావణ్య చెబుతున్నారు. అప్పటి నుంచి వారిద్దరు ఒకే ఫ్లాట్‌లో కలిసి ఉంటున్నట్లు చెప్పారు. లావణ్య, అన్విక పేరుతో రాజ్ తరుణ్‌తో విదేశాలకు కూడా వెళ్లినట్లు, తనతో ఉన్న సమయంలోనే తనకు అబార్షన్ కూడా చేయించాడని లావణ్య వెల్లడించారు.
రాజ్ తరుణ్ కొత్త సినిమా తిరగబడరాస్వామి హీరోయిన్ మాల్వీ మల్హోత్రాతో ఎఫైర్ పెట్టుకున్నాడని, తాను వచ్చిన తర్వాత నన్ను దూరం పెట్టాడని లావణ్య చెప్పారు. తన కోసం రెండు మూడు సార్లు రాజ్ తరుణ్ ముంబయి కూడా వెళ్లాడు. ఆ సమయంలో నేను ప్రశ్నించాను. ఇప్పుడు తనతో పాటు విదేశాలకు వెళ్లాలని ప్రయత్నిస్తున్నాడని తెలిపారు. ఇక సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్న వాయిస్ తనను రెచ్చగొట్టి, ఉద్దేశపూర్వకంగా రికార్డు చేశాడని లావణ్య పేర్కొంది.